Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా వారియర్స్‌గా గుర్తించాలని బీజేవైఎం రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శి పిడిశెట్టి ప్రవీణ్‌చంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లిలో ముషీరాబాద్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫొటో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగరావు, ప్రెసిడెంట్ సీహెచ్ వీరారెడ్డి, ఉపాధ్యక్షులు కె. నర్సింహా, కార్యదర్శి జహంగీర్, పిడిశెట్టి కుటుంబ సభ్యులు ప్రభాకర్, సుజాత, పవన్ చంద్ర, డాక్టర్ ప్రసేన్, మల్లెల శిరీష సంతోష్, బీజేపీ నాయకులు గంటా శ్రీనివాస్, టీ విశ్వనాథ్, విపిన్ కుమార్, అడ్వకేట్ బాబు తదితరులు పాల్గొన్నారు.