Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో అనుసంధానం చేయాలని కన్జ్యూమర్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రామగిరి హరిబాబు, మహిళా వింగ్ గ్రేటర్ అధ్యక్షురాలు గాధం లలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాలు, కూరగాయల విక్రయకేంద్రాలు, తదితర ప్రాంతాల్లో మెడికల్ మాస్క్లు, శానిటైజర్ లను సుమారు 500 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆయుష్మాన్ భవ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు ఎలాంటి ఉపయోగం లేదని, దానికి దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఆ పథకం వర్తిస్తుందన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం ద్వారా 80 లక్షలకు పైగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలకు కరోనా, ఇతర వ్యాధుల ద్వారా రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే ప్రజా ధనాన్ని రక్షించిన కీర్తి ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. నాయకులు దశరథలక్ష్మి, తులసి, కరుణ, సుల్తానా, మాతంగి సుమన్ రాజు, రవీందర్ పాల్గొన్నారు.