Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం అంబర్‌పేట డివిజన్లోని పటేల్‌నగర్ బిలాల్ మజీద్ గల్లీలో సుమారు రూ.6 లక్షలతో చేపట్టనున్న నూతన డ్రెయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవతీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు సలీం, మోసిన్, మహేష్ ముదిరాజ్, ఆదిల్, శ్రీనివాస్‌గుప్త, గౌస్, హైమద్, నాగరాజు, ఎస్.కె.గౌస్, జగన్రావు, సమీర్, రంగు ఉదరుగౌడ్, దినేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.