Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కరోనా లాంటి విపత్కర సమయంలో పేదరికంతో బాధపడుతున్న వారికి సాయం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆల్విన్ కాలనీ124 డివిజన్ పరిధిలో డా.పవన్, కాలనీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కోవిడ్ పేషంట్ల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌తో కలిసి ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో పేదరికంతో బాధపడుతున్న కోవిడ్ పేషంట్లకు ఆహారాన్ని హోం డెలివరీ, ఫ్రీ టెస్ట్‌లు చేయడంతోపాటు అంబులెన్స్ సేవలు ప్రారంభించినందుకు డా.పవన్, సత్యనారాయణ లను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ ప్రెసిడెంట్ జిల్లా గణేష్, వార్డ్ మెంబెర్ కాశీనాథ్ యాదవ్, కృష్ణారావు, పోశెట్టి గౌడ్, రామకృష్ణ, నరసింగ్ రావు, శంకర్, యాదవ్ రెడ్డి, గోపిచారి, వాసుదేవ్ రావు, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.