Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలికాన్ఫరెన్స్లో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయాడానికి కార్పొరేషన్ పాలక వర్గం, అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. గురువారం బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు కరోనా సమయంలో అందుతున్న వైద్య సేవలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ లాంటి సౌకర్యాలతో పాటుగా పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న వైద్య సేవలు, ఫీవర్ సర్వే,హైడ్రోక్లోరైడ్ పిచికారీ వంటి కార్యక్రమాలపై వివిధ డివిజన్ల ప్రజలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు మనోధైర్యంతో ఉండాలని వైద్యుల సలహామేరకు చికిత్స చేయించుకోవాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో అన్ని వసతులతో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం అన్ని వసతలతో కూడిన ఐసోలేషన్ సెంటర్ 50 పడకలతో ఏర్పాటు చేసి, అందులో 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూస్తున్నామని తెలిపారు. అన్ని డివిజన్లలో నిరంతరం పరిశుభ్రం చేస్తున్నామని ఆయన చెప్పారు.