Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. గురువారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ చెక్ పోస్టు వద్ద చేపడుతున్న వాహనాల తనిఖీని పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు, లాక్ డాన్ అమలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరు బయటకు రాకుండా, లాక్ డౌన్‌కు సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో భాగంగా యాభై వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ స్వామి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-