Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
ట్రంకులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు పెండ్యాల నర్సింహ, కిసర గోవర్ధన్ రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారీ వర్షాలు కురిస్తే చాలా కాలనీలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ట్రంకులైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే పెద్ద చెరువు, మంత్రాల చెరువుల్లో మురుగునీరు తోడేసి పూడిక మట్టిని తీసి వర్షపునీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కరుణానిధి, బింరాజు, పసునూరి భిక్షపతి, నాయకులు మధు, సోమేశ్వర్, శ్రవణ్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.