Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోఠి ఈఎన్టీ ఆసుపత్రి లో బ్లాక్ ఫంగస్ సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్, బ్లాక్ ఫంగస్ నోడల్ అధికారి డాక్టర్ శంకర్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ డాక్టర్ ఏబీ రావు కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ అభివద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మెన్ డాక్టర్ క్రిస్టినా చోంగ్టూ పాల్గొని ఆస్పత్రిపై అభివద్ధి పై చర్చించారు. అనంతరం డా. శంకర్ మాట్లాడుతూ ఈఎన్టీ నోడల్ కేంద్రం ఆస్పత్రిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు. గురువారం 39 బ్లాక్ ఫంగస్ కొత్త కేసులు నమోదు కాగా మొత్తం 90 మందికి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఏడుగురికి ఆపరేషనన్లు కూడా నిర్వహించామని తెలిపారు. రోగులకు అవసరమయ్యే మందులు అంపొటెరిసిన్-బి ఇంజక్షన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీఅందుబాటులో ఉన్నాయని వివరించారు. బ్లాక్ ఫంగస్ సోకిన కొందరు రోగులు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించుకుని ఇంజక్షన్ల కోసమే కోఠి ఈఎన్టీ ఆసుపత్రి వస్తున్నారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన రోగులు నేరుగా ఇక్కడికి వస్తే వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తమ వైద్య బందం సిద్ధంగా ఉందని తెలిపారు.