Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
పదిరోజుల్లో డ్రెయినేజీ- లువ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వర్షపునీటి కాలువను పనులను త్వరగా షురూ చేయాలని కోరుతూ గురువారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ నాయకులు వంటేరు నర్సింహ రెడ్డి, బండి నాగేష్, సిద్దాల బాలప్ప మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షం వస్తే శ్రీధర్ కాలనీ, గాయత్రి నగర్ ఫేస్ 4, దేవి గాయత్రి నగర్, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచించి కోటి రూపాయల నిధులు మంజూరు చేశామని, మరో పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈసందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు సుదర్శన రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.