Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ లైన్మెన్పై చర్యలు తీసుకోవాలని యంనంపేట్ గ్రామ నాయకులు పత్తెపు పాండు, బొక్క బుచ్చిరెడ్డిలు బుధవారం విద్యుత్ ఏడీకి ఫిర్యాదు చేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ గ్రామంలో గత కొన్ని వారాలుగా విద్యుత్ సమస్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లైన్ మెన్ చర్యలు చేపట్టకుండా ప్రయివేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సదర్ లైన్ మెన్ పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని కోరారు.