Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మానవత్వపు విలువలు కలిగిన బుద్ధుని మార్గమే బహుజనులను విముక్తి చేస్తుందని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం ఓయూ తన నివాసంలో బుద్ధ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణ, హిందుత్వాన్ని అంతం చేయడానికి లక్షలాది మందితో బౌద్ధ జ్ఞాన మార్గాన్ని స్వీకరించి బహుజనులకు ఆదర్శంగా నిలిచారన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పునాదిగా ఏర్పడిన బౌద్ధాన్ని బహుజనులంతా అనుసరించి బ్రాహ్మణీయ హిందుత్వ ఆధిపత్య సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, బుద్ధుడి మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దక్షిణ భారత పరిశోధక జేఏసీ కన్వీనర్ దుర్గం శివ, కో కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ..
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డా. కడియం రాజు, ఏబీవీపీ సంభాగ్ ప్రముఖ్ డా.రామకష్ణ, రచ్చ శ్రీనివాస్, శ్రీశైలం వీరమల్ల, సుమన్ శంకర్, ఎల్లస్వామి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.