Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
గోల్నాక డివిజన్లోని హిందూ శ్మశాన వాటికలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంబర్‌పేట నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈమేరకు బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్నాకలోని హిందూ శ్మశాన వాటికలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. శ్మశాన వాటికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అన్ని వసతులు కల్పించాలని, మైనార్టీలకు మూడు ఎకరాల స్థలంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్.కె.బాబు, నర్సింగ్‌యాదవ్, యూసుఫ్, ఉమేష్ రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.