Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకను సిటీలో ఘనంగా నిర్వహించారు. గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌వద్ద నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జిల్లా ఆఫీసులో ఆయన విగ్రహానికి టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పి.సాయిబాబా మాట్లాడారు. తెలుగుజాతికి, తెలుగు వారికి విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చిన మహౌన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. నాడు కేంద్రంలో నెలకొన్న నియంతృత్వ, నిరంకుశ పాలనను తుదముట్టించాలని నేషనల్ కూటమిని ఏర్పాటు చేసి, దానికి చైర్మెన్‌గా వ్యవహరించి కాంగ్రేసేతర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని గత దశాబ్దంన్నర నుంచి కోరుతున్నామని గుర్తు చేశారు. మహానాడులో రెండో రోజు సాంప్రదాయకంగా అన్ని తీర్మానాలను వెబినార్ ద్వారా నిర్వహించుకుని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్‌గౌడ్, కె.కొమురన్న, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, వెంకటేష్ చౌదరి, కె.కిరణ్ కుమార్, జోగింధర్ సింగ్ పాల్గొన్నారు.