Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పశుసంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట
కరోనా నుంచి ప్రజలను రక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని స్పోర్ట్స్ కాం ప్లెక్స్, బన్సీలాల్ పేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, కుర్మా హేమలతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, బాధి తులకు చికిత్స, మందుల సరఫరా తదితర విషయాలలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జీహెచ్ ఎంసీ పరిధిలో సర్కిల్ కు ఒకటి చొప్పున 30 కేంద్రాలను ప్రారంభించి సూపర్ స్ప్రె డర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని తెలిపారు. సూపర్ స్ప్రెడర్స్‌గా పిలువబడే కూరగాయల విక్రయదారులు, చిన్న వ్యాపారులు, అటో డ్రైవర్లు, ఫుట్ పాత్ వ్యాపారులు తదితరులు ఈ కేంద్రాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ అధికారులు టోకెన్లను అందజేస్తారని, అందులో తెలిపిన సమయానికి కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జర్నలిస్టులకు కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయ ంలో డాక్టర్లు, నర్సులు, ఆశావర్కర్లు, పోలీసులు, జీహెచ్ ఎంసీ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. లాక్డౌన్ కారణంతో ఎవరూ ఆకలితో అలమటించవద్దన్న ఉద్దేశంతో ప్రతిరోజూ 60 వేల మందికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ శానిటైజేషన్, పారి శుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని చెప్పారు. కరోనావంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కషిచేస్తు ంటే కొందరు ఇటువంటి సమయంలో కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం కరెక్టుకాదన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంసీలు వంశీ, ముకుందరెడ్డి, ఏఎంహెచ్‌వో భార్గవ్ పాల్గొన్నారు.