Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్లో తొలిరోజు 21,666 మందికి టీకా
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి రోజైన శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మం దికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగింది. నిత్య సేవకు లుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందినవారికి నేటి నుంచి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో విస్తత ఏర్పాట్లను చేపట్టింది. ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను గురువారం అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది. కాగా నగరంలో చేప ట్టిన ఈ ప్రత్యేక వాక్సినేషన్ ప్రక్రియను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతెశ్రీలత, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ఒవైసి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వాక్సినేషన్ కేం ద్రాలను పరిశీలించారు. నగర మేయర్ గద్వాల విజయ లక్మ్షి బంజారాహిల్స్ వాక్సినేషన్ సెంటర్‌తో పాటు సనత ్నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెంటర్లను పరిశీలి ంచారు. డిప్యూటి మేయర్ మోతెశ్రీలత సికింద్రాబాద్ సర్కిల్లోని పలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను మేయర్ గద్వా ల్ విజయలక్మ్షి, కమిషనర్ లోకేష్‌కుమార్‌లతో కలిసి సంద ర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ పక్కన ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గోషామహల్ సర్కిల్లోని రెడ్రోస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు కేంద్రాన్ని, ఖైరతాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటి స్పీకర్ పద్మారావు సీతాఫల్మండి కేంద్రాన్ని పరిశీలిం చారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఫలక్‌నూమా సర్కిల్లోని పలు కేంద్రాలను పరిశీలి ంచారు. ఎమ్మెల్సీలు షంబీపూరి రాజు, నవీన్‌రావు, ఎమ్మె ల్యేలు మాధవరం కష్ణారావు, వివేకానంద, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పాషాఖాద్రీ, దానంనాగేందర్, మా గంటి గోపినాథ్ తదితర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.