Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హెల్త్‌కేర్ వర్కర్స్ ఇంట్లోని వారందరికీ టీకా ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక కోరింది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కొవిడ్ విదుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్య లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడా లని శుక్రవారం మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ యూనై టెడ్ ఫోరం (వైద్య, ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక) ఆధ్వ ర్యంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ విధుల్లో ఉండి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలనీ, వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి వారి అర్హతకు దగ్గ ఉద్యోగం నెల రోజుల వ్యవధిలో కల్పించాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఇంతకు ముందు ఇచ్చినట్టు 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలనీ, షిఫ్ట్‌ల వారీగా డ్యూటీలు వేసి పని ఒత్తిడిని తగ్గించాలనీ, 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకమైన వైద్య సిబ్బ ందికి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలనీ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్స పొందిన హెల్త్ కేర్ వర్కర్లకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారు. వినోద్‌కు కలి సిన వారిలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ కత్తి జనార్ధన్, ఆర్. సుజాత, వీరారెడ్డి, మంచాల రవిందర్, ఎ.సుజాత, తదితరులు ఉన్నారు.