Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణ ంలో హస్తినాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షులు, దీనబందు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్లోని వెంకటేశ్వర కాలనీ, డీఆర్డీఎల్ కాలనీ, షిరిడీ సాయి నగర్ కాలనీల్లోని 500 కుటుంబాల కు కురాగాయలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారనీ, పేద ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా రాజ కీయాలకు తావు లేకుండా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్నేండ్లుగా తమ సంస్థ ద్వారా ప్రజలకు తమ వంతు చేయూతగా అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులను డివిజన్ లో పంపిణీ చేశామన్నారు. డివిజన్లో నిత్యం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. డివిజన్ ప్రజ లకు ఐదు రకాల కూరగాయలను తమ సంస్థ ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దీనబందు సేవా సదన్ సంస్థ సభ్యులు సుధాకర్‌రెడ్డి, కొత్తపల్లి అంజి, ఓబులు రెడ్డి, మాధవ్, శ్రీనివాస్, పెద్దిరెడ్డి, రాజు, రవి పాల్గొన్నారు.