Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కరోనా బాధితులకు అండగా ఉంటామని అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ కె.వి.ప్రసాద్ గుప్త అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో గల ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కరోనా సమయంలో అనేకమంది పేదలకు ఆర్థిసాయం అందజేశామని, నిత్యా వసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా పోలీసులకు, రిపోర్ట ర్లకు పారిశుధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి, కరోనా నివారణకు కావాల్సిన అన్ని రకాల పరికరాలను అందించామన్నారు. మొదటి దశలో కొవిడ్ బారినప డకుండా అనేక రకాలుగా ఆదుకున్నామని చెప్పారు. అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన సహాయాన్ని అందరూ అభినందించారని తెలిపారు. ప్రస్తుతం రెండో దశ కరోనా టైమ్‌లో కూడా అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలంలో 50 కుటుంబాలలో కరో నా బాధితులు ఉన్నట్లు గుర్తించి, వెంటనే ట్రస్ట్ సభ్యులను పురమాయించి, హైదరాబాద్ నుంచి నెలకు సరిపడా 25 కేజీల రైస్ బస్తాలను, నిత్యావసర సరుకులను, ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ట్రస్ట్ సభ్యులు ఆయా గ్రామాలలో పర్యటించి, కరోన బాధిత కుటుంబాలకు నిత్యా వసర సరుకులు ,ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతినిధి శ్యాంసుందర్ మాట్లాడుతూ.. అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కెవి ప్రసాద్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తొ ర్రూరు మండలంలో గల 50 కుటుంబాల కరోనా బాధితులకు నిత్యావసరాలు, ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అవతార్ ట్రస్ట్ చైర్మెన్‌కు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినిమా ఆర్టిస్ట్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.