Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటోన్మెంట్
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చా లని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయ రామారావు శుక్రవారం తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మురళీధర్‌రావు హాజరై విజయరామరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయరామరాజు స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ సేవహి సంఘట న్లో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకో వడం కోసం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.. తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చక పోవడం వల్ల కరోనా బారిన పడిన పీడిత, బహుజన ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని పేర్కొ న్నారు. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలనీ, తల్లి దండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష్, సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ కె బి శంకర్ విజరు ఆనంద్ సాముల సత్తిరెడ్డి రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.