Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ జెడ్పీహెచ్ ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌తోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న సుమారు వేయి మంది జర్నలిస్టులకు టీకాలు అందిస్తామన్నారు. రేషన్ డీలర్లు, పెట్రోల్ పంప్ సిబ్బంది, ఫర్టిలైజర్స్, ఇతర దుకాణ దారులు, విధి వ్యాపారుల కోసం 28 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈఅవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 9500, జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో 35 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యమ్రాన్ని చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాలో సరిపడా ఆక్సిజన్, ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, స్థానిక మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, బాలాపూర్ తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు మనోహర్, ప్రభాకర్ రెడ్డి, పవన్‌యాదవ్, శివకుమార్, పి.సుదర్శన్ రెడ్డి, ముత్యాల లలిత కష్ణ, శ్రీధర్ రెడ్డి, మెడికల్ సూపర్వైజర్ నర్సింగ్ రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.