Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కరోనా వ్యాప్తి నివారణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా చేపడుతోందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు సూపర్ స్రైడర్స్గా వ్యవహరిస్తున్న వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రత్యేకంగా వాక్సినేషన్ చేపడుతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్‌మండీలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి వల్ల ప్రజా జీవితమే అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటూ వ్యాప్తిని నివారించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కనీసం 15 వేల మంది సూపర్ స్పైడర్స్‌కు 10 రోజుల్లో టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చిరు, వీధి వ్యాపారాలు, కూరగాయల విక్రేతలు, దుకాణాల నిర్వాహకులు, రేషన్ డీలర్లు, గ్యాస్ డీలర్లు వారి సిబ్బంది మొదలుకొని వివిధ వర్గాల వారికి ఈఅవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీతా, లక్ష్మీప్రసన్న శ్రీనివాస్, కంది శైలజ, టీఆర్ఎస్ యువనేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ డీసీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.