Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట/ఓయూ
డిసెంబర్‌లోగా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ పిలువు మేరకు ఆదివారం సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన పలు సేవాకార్యక్రమాలకు ముఖ్య అతిథి హాజరయ్యారు. పద్మారావునగర్, శ్రీనివాస్ నగర్లో బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బన్సీలాల్‌పేట్‌లో వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని కేంద్రప్రభుత్వం ప్రజల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుదన్నారు. గడిచిన రెండేండ్లలో పెద్దఎత్తున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, బెడ్ల సంఖ్యను పెంచుకొని, వైద్య సంబంధిత పరికరాల పరిశ్రమలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. కోవిడ్‌ను పారద్రోలడంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ఆపత్కాలంలో దేశప్రజలను ఆదుకోవడం కోసం సేవాహిసంఘటన్లో భాగంగా బీజేపీ నాయకులు పెద్దఎత్తున ప్రభుత్వాలకు సమాంతరంగా సహాయక కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అనంతరం లాలాపేటలోని జయ శంకర్ స్టేడియంలో బీజేపీ సీనియర్ నేత సుక్క. గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కొన్నేండ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గణేష్ సేవా నిరాతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, శ్యామ్ సుందర్ గౌడ్, సారంగపని, బీజేవైఎం మహంకాళి సికింద్రాబాద్ అధ్యక్షుడు శివాజీ, రుద్రగాని సందీప్ శివాజీ, అయ్యప్ప, భరత్, గంగా, అరవింద్, ఉదరు, బీజేపీ అధ్యక్షుడు శ్యామసుందర్ గౌడ్, సారంగపాని, కృష్ణమూర్తి, ప్రభు గౌడ్, హరి, భాస్కర్, గిరి పాల్గొన్నారు.