Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీల్వెల్ కార్పొరేషన్ ప్రయివేటు లిమిటెడ్ చైర్మెన్ బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో అదివారం లాక్ డౌన్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని భరద్వాజ కాంప్లెక్స్‌లో శ్రీ వాసవీమాత దర్శిని మాసపత్రిక ఎడిటర్ వల్లంబొట్ల శ్రీనివాసరావు పర్యవేక్షణలో సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది నిరుపేదలకు ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. అనంతరం శ్రీ వాసవీమాత దర్శిని ఎడిటర్ వల్లంబొట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ దానశీలి, సీల్వెల్ కార్పొరేషన్ ప్రయివేటు లిమిటెడ్ చైర్మెన్ బండారు సుబ్బారావు జంటనగరాల్లో పలు సేవా సంస్థల ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది నిరుపేదలకు, అవసరం ఉన్నవారికి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారని, సహాయం పొందిన పలువురు బండారు సుబ్బారావు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన గుర్తుచేశారు.