Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆదివారం మౌలాలి డివిజన్లోని దీన్ దయాల్ నగర్లో రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రెయినేజీ పనులను కార్పొరేటర్ గున్నాల సునీత యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది వర్షాకాలంలో ఓ చిన్నారి సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు ఓపెన్ నాలాలో పడి మతి చెందిందని, అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా బాక్స్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ సువర్ణ, ఏఈ స్వరూప, కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, శ్రావణ్ కుమార్, ప్రేమ్ కుమార్, నాయకులు బద్ధం పరశురామ్ రెడ్డి, శేఖర్ యాదవ్, జీఎన్వీ సతీష్ కుమార్, రాము యాదవ్, గుండా నిరంజన్, అమీనుద్దిన్, పిట్ల శ్రీనివాస్, శేఖర్ గౌడ్, ఫరీద్, బాలకృష్ణ పాల్గొన్నారు