Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మహమ్మారి బారిన పడి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న కుటుంబ సభ్యులకు వైద్యో నారాయణ అంటూ జీవిస్తున్న కొందరికి ఆసుపత్రిలో పట్టపగలే చుక్కలు చూపిస్తూ జేబులు ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్స్ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకుంది. నిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితుడికి పడక ఇప్పిస్తానని రూ.లక్ష వసూలు చేసిన వ్యక్తిపై ఆస్పత్రి వర్గాల ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఈనెల 18న నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని మహదేవపూర్‌కు చెందిన కష్ణారెడ్డి నిమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి, తన తల్లి సుగుణమ్మ కరోనాతో బాధపడు తోంది చేర్చుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ప్రశాంత్ అనే వ్యక్తి కలిసి తాను చేర్పిస్తానని, వెంటనే రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో కష్ణారెడ్డి గూగుల్ పే ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. రూ.లక్ష చెల్లించాలని, ఆక్సిజన్‌తో సాధారణ చికిత్సకు రూ.3-4 లక్షలు, వెంటిలేటర్ పెడితే రూ.7లక్షలు అవుతుందని చెప్పాడు. అనుమానంతో కష్ణారెడ్డి, తల్లి కేస్ షీట్‌ను పరిశీలించగా రూ.వెయ్యి చెల్లించి నట్లు బిల్లు తప్ప మరే ఇతర చెల్లింపులు కనిపించ లేదు. చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలను కోరగా అంతర్గత విచారణకు ఆదేశించారు. అనంతరం విచారణలో సుగుణమ్మను చేర్చుకో వాలని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా.మహేందర్ కు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.ఎన్. లక్ష్మీభాస్కర్ సూచించినట్లు తేలింది. ప్రశాంత్‌కు ఆస్పత్రితో సంబంధం లేదని అతడు ఇలాగే రోగులు, రోగుల సహాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గుర్తించారు. ఇలాంటి వారి వల్ల సంస్థ పేరు దెబ్బతింటోందని పేర్కొంటూ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారా యణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిమ్స్‌లో వెలుగు చూసిన మరో మోసం
కోవిడ్ రోగుల బెడ్ని బ్లాక్‌లో అమ్ముకున్న నిమ్స్ అధికారి. బ్రోకర్లను పెట్టి బ్లాక్‌లో బెడ్స్ దందా చేసిన అధికారులు. ఇప్పటికి 60కి పైగా బెడ్స్ అమ్ముకు న్నట్టు నిమ్స్ అంతర్గత విచారణలో వెల్లడైంది. కోటి రూపాయల నిమ్స్ ఆదాయానికి గండి కొట్టిన అధికారులు. బ్రోకర్‌కి లక్ష ఇస్తే వేయి రూపాయల బిల్ చేతిలో పెట్టిన వైనం. డబ్బులు వసూలు చేసిన ఈ మోసగాడు. నిమ్స్‌లోని ఒక అధికారికి వ్యక్తి గత సహాయకుడు మోసగాడు. కరోనా పడకనూ అమ్ము కొని లక్షలు వెనకేసుకున్న అధికారి పేరు బయటకు రాకుండా ప్రయత్నం. నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కోవిడ్ రోగి వద్ద లక్ష వసూలు చేసిన మోసగాడిపై పంజాగుట్ట పోలీ స్ స్టేషన్లో కేస్ నమోదు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.