Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
సేవ హి సంఘటన్ కార్యక్ర మంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రభు త్వం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అల్విన్ కాలనీ డివిజన్, శ్రీ తులసినగర్లో బీజేపీ ఇంచార్జ్ సురభి రవీందర్ రావు, చెన్నమనేని స్రవంతి ఆధ్వర్యంలో బీజేపి రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్ పాల్గొనగా, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి, పూటగడవక అవస్తలు పడుతున్న పేదలకు, వలస కార్మికులకు, రెండవ రోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీజేెవైఎం జాతీయ నాయకులు నరేందర్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, కుమార్ చారి, శ్రీనివాస్, రజినీకాంత్, బద్రి పాల్గొన్నారు.