Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హస్తినాపురం బీజేపీ పార్టీ అధ్యక్షులు పి.నరేష్ యాదవ్
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి సుదీర్ఘ సుపరిపాలన అందించడంలో సఫలీ కతులయ్యారని తెలుపుతూ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు పి.నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో వందమంది జీహెచ్ఎంసీి ఉద్యోగు లకు మరియు కార్మికులకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశాభివద్ధిలో ఎంతో కీలకమైన ప్రధాని పదవికి వన్నె తెచ్చిన ప్రజానాయకుడు నరేంద్ర మోడీ అని వారు కొనియాడారు. దేశ రాజకీయాలలో అగ్రగణ్యుడుగా ఉంటూ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపే సత్తా ఉన్న నాయకుడు మన ప్రధాని అని నరేష్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బీజేప పార్టీ నాయకులు అమరేందర్ రెడ్డి, బీజేెవైఎం నాయకులు జీవన్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.