Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలో కొనసాగుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు 7 సంవత్సరాల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్బంగా సేవాహి సంఘటన కార్యక్రమాలు ఎల్.బి నగర్ నియోజకవర్గంలో ఆదివారం పలు చోట్ల నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు, సరుకులు మాస్కు, కూరగాయలు, వాటర్ బాటిల్స్, శానిటైజర్స్ పంపిణీి చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా 7ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లల పాలిట మోడీ అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి , చింతల అరుణ సురేందర్ యాదవ్, బానోతు సుజాత నాయక్, ఆకుల అఖిల్ పవన్, నూతి శ్రీనివాస్, నాంపల్లి రామేశ్వర్, విజరు భాస్కర్, నరేష్ యాదవ్, కష్ణం రాజు, మల్లేష్ గౌడ్, రాజు గౌడ్, రాకేష్ యాదవ్ పాల్గొన్నారు.