Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
- శ్రీ వ్యాక్సినేషన్ సెంటర్ తనిఖీ
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతోందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆదివారం సీతాఫల్‌మండీలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ ప్రత్యేక టీకా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టీకా పంపిణీకి అధిక ప్రాముఖ్యతనిస్తుందని, అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామ న్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కనీసం 15 వేల మంది సూపర్ స్ప్రెడర్స్‌కు 10 రోజుల్లో టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, ఆతరువాత అర్హులైన వారందరికీి టీకా ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.