Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ-దుండిగల్
కరోనా లాక్ డౌన్ దష్ట్యా ప్రజలు ఇళ్ల నుండి వ్యాక్సిన్ కేంద్రాలకు రావడం ఇబ్బందికరంగా ఉన్న దష్ట్యా జనసర్వే నిర్వహించిన తీరున వైద్య సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి టీకా వేయాలని, చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే పేద ప్రజలకు ఆర్థిక భతి కింద సహాయ సహకారాలు అందించాలని అన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగణిగళ్ళ బాలపిర్ డిమాండ్ చేశారు. కేవీపీిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరోనా వ్యాధి వైరస్ వలన చనిపోయిన మతుల కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు నాగనిగళ్ళ బాలపీరు డిమాండ్ చేశారు ఆదివారం కేవీపీిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసనలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తన ఇంటి వద్ద నుంచి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగనిగళ్ళ బాలపీరు మాట్లాడుతూ ప్రతి ఇంటికీి తిరిగి కరోనా టీికా వేయాలని, ఆర్థికంగా అతలాకుతలమైన బీద, బలహీన ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు, 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని కోరారు. కరోనా వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రజలు కరోనా బారినపడి మరణించినప్పటికీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో ప్రజలకు వైద్యం అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అన్నారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితుల్లోకి వెళ్లిందని అన్నారు.
పిఎం కేర్ ఫండ్ బహిర్గత పరిచి వైద్యం కొరకు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే రాష్ట్రం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యరంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.సంవత్సరం కాలంగా కరోనా వలన ఉపాధి కోల్పో యిన ప్రజలను ఆదుకోవాలని గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను 200 రోజులు కల్పించి 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వెంటనే రుణాలు అందించి పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీిఎస్ నాయకులు వంశీ, పల్లవి, సుజాత ఉప్పలయ్య ,లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.