Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పరిధిలో ఉన్న పేద ప్రజలను అన్ని విధాలుగా అదుకుంటామని మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మా రెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నిరుపేదలకు ఆహార పదార్థాలను అందజేసిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు అందచేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వివాహ దినోత్సవం సందర్భంగా పేదలకు ఏదో ఒక విధంగా ఉపయోగ పడాలని ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. అలాగే కరోనా సమయంలో ప్రజలకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న పోలీసులకు, శానిటేషన్ సిబ్బందికి ఒక్క రోజు తమ వంతుగా ఆహారాన్ని అందజేశామని తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి నశించి సుఖశాంతులతో ఉండాలని వారు అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఎన్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.