Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
భారతీయ జనతా యువమోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆధ్వర్యంలో సేవాహీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు చింతల రాంచంద్రారెడ్డి, నగర అధ్యక్షుడు ఎన్.గౌతమ్‌రావు హాజరై రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో దాదాపుగా 100 మంది కార్యకర్తలు రక్తదానం చేశారని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో దేశంలో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందుండేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలతో పాటు, నిరుపేదలకు భోజన సౌకర్యం కల్పించడం చేపట్టడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా భారతీయ జనతా యువమోర్చా నగర అధ్యక్షులు సందీప్ యాదవ్, నగర ప్రధాన కార్యదర్శులు అవినాష్, యశ్వంత్, ఉపాధ్యక్షులు సంతోష్, కార్యదర్శులు ప్రవీణ్, శ్రీధర్‌గౌడ్, ఫణికుమార్, అధికార ప్రతినిధి వెంకట్, పదాధికారులు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉచిత అంబులెన్స్ ప్రారంభం
నవతెలంగాణ-ఓయూ
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం బౌద్ధనగర్ బీజేపీ సీనియర్ నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సు సర్వీస్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, కృష్ణమూర్తి, ప్రభు గుప్తా, హరి, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ ప్రకాష్, వీరన్న గణేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పోచయ్య యాదవ్ వేణు, శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, రాము వర్మ తదితరులు పాల్గొన్నారు.
' స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి'
నవతెలంగాణ-కల్చరల్
కరోనా కష్ట కాలంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సహాయకార్యక్రమాలు చేస్తున్నారని వారి సేవలు ప్రశంసనీయ మని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చిక్కడపల్లి వద్దనున్న జవహర్ నగర్ లో ఆదివారం యూనివర్సల్ హెల్ప్ ఫౌండషన్, ఆర్.కె.ఏ. ఎనర్జీ(అమెరికా) సౌజన్యం తో నమో ఐసోలాషన్ సెంటర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమెరికా లోవుండి పుట్టిన గడ్డను మరువక పోవటం అభినందానీయమన్నారు. కార్పొరేటర్ పావని, నాయకులు విజయకుమార్ పాల్గొన్నారు. రామ్ మాట్లాడుతూ అమెరికా లో ఉన్న ధవ్, సూర్య ఈ సెంటర్ ఏర్పాటుకు సహకరించారన్నారు.