Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వ్యాధి నిరోధక శక్తిని పెంపు చేసి కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు శతాయుష్ ఆయుర్వేద ఎన్ఏ ఎస్టీ ఫార్మా కంపెనీ ఔషదాన్ని రూపొందించిందని ఆ సంస్థ ఎండీ విష్ణు, ప్రధాన చీఫ్ ఫార్మాసిస్ట్ శరత్ తెలిపారు. అర్క పద్దతిలో ఔషధ గుణాలు కలిగిన చంద్రదారు, అశ్వగంధ, జీవంతి, యష్ట మధు మొక్కల రసాలను సేకరించి ఈ ఔషధం రూపొందించామని తెలిపారు. ఈ ఔషధం రెండుతెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా అందిస్తామమన్నారు. కోవిడ్ నియంత్రణ ఆమేరకు ఉందో నిర్ధారణకు కేంద్ర వైద్యారోగ్య శాఖ పరిధిలోని క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా(సిటీఆర్ ఇ ఏ) లో నమోదు చేయడం జరిగిందన్నారు. హైద్రాబాద్ కేంద్రం లోని ఎంపలాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సూపర్ స్పెషలిటీ వైద్యశాల లో డాక్టర్ శైలజ నిర్వాహణ లో కరోన పాజిటివ్ వారిపై క్లినికల్ ట్రయిల్ నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వాలు కారోన సోకినవారికి ఇస్తున్న అల్లోపతి మందులతో పాటు ఈ ఔషధం చేర్చాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కోరారు. ఔషధ వివరాలకు 8008002256లో సంప్రదించవచ్చు నని సూచించారు.