Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా టైంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై సంతృప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ వాసులకు మెట్రో అధికారులు గుడ్న్యూస్ అందించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు నేటి నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. నేటి నుంచి ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి 2 గంటల వరకు చివరి స్టేషన్కు చేరుకోనుంది. సోమవారం హైదరాబాద్ మెట్రో రైలులో సీఎస్ సోమేశ్ కుమార్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ప్రయాణించారు. ఖైరతాబాద్ స్టేషన్ నుంచి అమీర్ పేట్ వరకు మెట్రో రైలులో వెళ్లారు. కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రోలో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా పరిశీలించారు. మెట్రో సేఫ్టీపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో సమయాల్లో మార్పులు చేస్తూ సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో మెట్రో తీసుకుంటున్న జాగ్రత్తలపై సీఎస్ సోమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.