Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదర్‌నగర్ డివిజన్ పరిధి హెచ్ఎంటీ హిల్స్‌లోని కమ్యూనిటీ హాల్లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను యథావిథిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరారు. ఈమేరకు సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ హైదర్‌నగర్, ఆల్వీన్‌కాలనీ, వివేకానందనగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన సుమారు 3.50 లక్షల ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ఈవిషయాన్ని మంత్రి కేటీఆర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని వరద నీటికాల్వ, నాలా నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.