Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కులను సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని వైభవ్ కాలనీ ఎస్బీఐ కాలనీ, రామకృష్ణనగర్, ఇంద్రప్రస్థ కాలనీలలోని పార్కులలో చేపడుతున్న పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కుల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటుచేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు, మహిళలు కూర్చునేందుకు బెంచీలతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, టైల్స్, పెయింటింగ్ వేయడం వంటి పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్క్ సుందరీకరణలో భాగంగా వివిధ రకాల చెట్లను నాటడం, సీసీ కెమెరాలు, పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి పార్క్‌లో వాచ్మెన్ ఏర్పాటు చేసి సందర్శకులకు ఎలాంటి లోటు లేకుండా వసతులు కల్పిస్తామన్నారు. పార్కులలో చేపట్టాల్సిన పనుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాజశేఖర్, సర్కిల్ మేనేజర్ సత్యనారాయణమ్మ, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు మధుసూదన్‌రెడ్డి, గెల్వయ్య, హేమంత్, రవి, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.