Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
లాక్డౌన్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. సోమవారం ఈసీఐఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లను తనిఖీ చేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశామని, మళ్లీ అలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే 16వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్సులు వెళ్లేందుకు ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ శివ కుమార్, కుషాయిగూడ సీఐ మన్మోహన్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.