Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగోల్, చైతన్యపూరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజలు ఎండలో నిల్చుంటున్నారని తెలుసుకొని వారి క్షేమం కోసం టెంటు ఏర్పాటు చేయించారు. అన్ని కేంద్రాల్లో తప్పకుండా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయించాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికోసం జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరుపున వాటర్ బాటల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఉపకమిషనర్లు మారుతి దివాకర్, కృష్ణయ్య, ఏఎంహెచ్ఓ మంజులవాణి, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, అనిల్ చౌదరి, చింతల రవికుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.