Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మిర్జల్‌గూడ, రాజా నగర్ కాలనీలలో రూ. కోటి 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రెయినేజీ పనులను కార్పొరేటర్ మేకల సునీత యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో మల్కాజిగిరిలోని అన్ని నాలాలపై దృష్టిసారించి కాలనీలు ముంపునకు గురి కాకుండా ప్రత్యేకంగా బాక్స్ డ్రెయినేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దీపక్, మేకల రాము యాదవ్, జీఎన్వీ సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.