Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
సికింద్రాబాద్‌ను ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ లోక్‌సభ సమీక్షా సమావేశం జరిగింది. ఈసమావేశానికి బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు అధ్యక్షత వహించగా, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సకల వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భరోసానిచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మ వెంకట్‌రెడ్డి, మహాలక్ష్మి రామన్ గౌడ్, వై అమృత, కన్నె రమేష్ యాదవ్, నగర మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వినోద యాదవ్, కేశ బోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.