Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్
కోవిడ్ పేషెంట్ వస్తే మొదట కాంటాక్ట్ అయ్యేది ల్యాబ్ టెక్నీషియన్నే అని పనినీ బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ తిరుపతి అన్నారు. సోమవారం ఆయన మాట్లా డుతూ ప్రజలు అనారోగ్యాల బారిన పడితే మొదట ల్యాబ్ టెక్నీషియనే రోగ నిర్ధారణ పరీక్ష నిర్వహించేది అని తెలిపారు. కోవిడ్ నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. పిపి కిట్టు వేసుకుంటే సుమారు ఐదు గంటలపాటు ఎంత ఇబ్బంది అయినా భరించాల్సిందే అన్నారు. రోజుకు 130 ర్యాపిడ్ టెస్టులు. 13 ఆర్ టీపీసీిఆర్ టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు. పని ఒత్తిడి పెరుగుతున్నా వెనుకడుగు వేయకుండా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరారు.