Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఏకీకత వీడియో నిఘా వ్యవస్థ మొదటి దశలో మొత్తం 17 స్టేషన్లు ఉన్నాయి. నిఘా వ్యవస్థ పర్యవేక్షణ ఇక మీదట మూడు స్థాయిలలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య జోన్ స్థాయిలో మొదటి దశలో 17 స్టేషన్లలో ఇంటిగ్రేటడ్ వీడియో సర్వేయిలెన్స్ సిస్టం (వీఎస్ఎస్) కంట్రోల్ రూమ్స్‌ను సోమవారం ప్రారంభించారు. వీటి ఏర్పాటుతో ఇకమీదట ఈ 17 స్టేషన్లలో రక్షిత నిఘా వ్యవస్థ ఫుటేజీని స్టేషన్, డివిజినల్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ మరియు జోనల్ సెక్యూరిటీ కంట్రోల్ వద్ద 3 స్థాయిలలో పర్యవేక్షించవచ్చని గజానాన్ పేర్కొన్నారు. ఈ 17 స్టేషన్లలో మూడు రాష్ట్రాల పరిధిలోని రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణలోని అదిలాబాద్, బేగంపేట, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటారు, కడప, కర్నూల్ టౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తుని స్టేషన్లు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల, నాగర్సోల్, పర్లి వైద్యనాథ్ స్టేషన్లు ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పీఎఎస్యు అయిన సెంట్రలైజ్డ్ రైల్‌టెల్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు 13 రైల్వే స్టేషన్ల వద్ద, 4 స్టేషన్ల (ఔరంగాబాద్, గుంటూరు రాజమండ్రి, వరంగల్) వద్ద ప్రస్తుత ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ స్థానాల్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) ఆధారిత వీఎస్ఎస్ ఏర్పాటు చేసింది. గతంలో రైల్వేచే ఏర్పాటయిన ఐపీ ఓఎన్బీఐఎఫ్ కెమరాలను భారతీయ రైల్వే మొదటి సారిగా నూతన వీఎస్ఎస్ వ్యవస్థతో అనుసం ధానించింది. అన్ని రైల్వే స్టేషన్లలో, ప్రీమియం, ఈఎం కోచ్‌ల వద్ద వీడియో విశ్లేషణ ముఖ్యమైన అంశాలను గుర్తించే వ్యవస్థతో ఐపీ ఆధారిత వీఎస్ఎస్ ఏర్పాటు పనిని రైల్వే బోర్డు రెల్టెల్లకు అప్పగించింది. ఇందులో భాగంగా, రైల్‌టెల్ ఏ1, ఏ,బీ,సీ,డీ మరియు ఈ కేటగిరి స్టేషన్లలో, ప్రీమియం రైళ్ల కోచ్‌లలో సబర్టన్ ఈఎమ్‌యూ కోచ్‌లలో వీడియా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
వీడియో నిఘా వ్యవస్థ ఏర్పాటుపై రైల్ టెల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ చావ్లా మాట్లాడుతూ వీడియో నిఘా వ్యవస్థను త్వరలో ఇతర స్టేషన్లకు, కోచ్‌లకు విస్తరిస్తామని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో జూన్ 2021లో మరో రెండు (బాపట్ల మరియు పూర్ణ) స్టేషన్లలో 2021-22 చివరినాటికి మొత్తం 76 స్టేషన్లలో అధిక సాంకేతిక రక్షిత విధానంతో వీఎస్ఎస్ ఏర్పాటు చేస్తారు. నాణ్యతతో కూడిన కవరేజీ, స్పష్టమైన చిత్రాల కోసం విభిన్నమైన నాలుగు రకాల డోమ్ టైప్, బులెట్ టైప్స్, పాన్ టిటి జూమ్ టైప్ అల్ట్రా హెచీ - 4కే వంటి ఫుల్ హెచ్ కెమెరాలు ఇందులో ఉంటాయి. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఫుటేజీలు ఘటన విశ్లేషణకు, దర్యాప్తు కోసం 30 రోజుల వరకు అందుబాటులో ఉంటాయి. సెక్యూరిటీ ఏజెన్సీల అవసారాలను బట్టి వీడియో లను దీర్ఘకాలంగా ఉంచవచ్చు. ఈ నిఘా వ్యవస్థ గురించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ. 24 గంటలూ పర్యవేక్షణలో ఉండే సెంట్రలైజ్డ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్స్ వీడియో ఫుటేజీలను పంపడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో 17 స్టేషన్లను 520 సీసీ టీవీ కెమెరాలతో రైల్టెెల్ అనుసంధానించిందని అన్నారు. ముఖక వళికలను స్పష్టంగా గుర్తించడానికి 4కే రిసొల్యూషన్ అల్ట్రా హెచీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నూతన వీఎస్ఎస్ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో రక్షణ మరియు భద్రత మెరుగుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.