Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఆదివాసీ ప్రొఫెసర్లకు యూనివర్సిటీ నియామకాల్లో ఎస్టీ కేటగిరిలో ఆదివాసులకి మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం, ఓయూ విద్యార్థులు వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణలను సోమవారం కలిసి ఓయూ ఆదివాసి పరిశోధన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్మిషన్ల ప్రక్రియలు ఆదివాసి విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. ఓయూలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లకు యూనివర్సిటీ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ సాగబో యిన పాపారావు, రాష్ట్ర అధ్యక్షులు బట్ట వెంకటేశ్వర్లు, గుమ్మడి సుధీర్ కుమార్, పెందొర్ రామకష్ణ, సోడె పాండురాజ్, కుంజ. కోటి పాల్గొన్నారు.