Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అబ్దుల్లాపూర్‌మెట్
గత 20 రోజులుగా పెద్దఅంబర్‌పేటలో కలుషితమైన నీరు వస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని స్థానికులు వాపోతున్నారు. పెద్ద అంబర్‌పేట పట్టణ పరిధిలో వస్తున్న కలుషితమైన నీరును వాటర్ బాటిల్ లో నింపిన దశ్యం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతి నిధుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులకు చలనం లేకపోవడం దారుణ మంటున్నారు. కలుషిత మైన నీరు వల్ల చిన్న పిల్లలలతో పాటు, అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఒక పక్క కరోనా విజంభిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరో పక్క కలుషిత నీరు ప్రజల ప్రాణాలకు ప్రాణ సంకటగా మారిందని మహిళలు మండి పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కలుషిత నీరు వ్యాధి కారకాలకు కారణం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. మంచి నీటి పైప్ లైన్లో మురుగు నీరు విషయం అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.