Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సేవ హి సంఘటనలో భాగం గా సోమవారం నాడు విద్యుత్ కార్మికులకు కంటోన్మెంట్ పారిశుద్ధ్య సిబ్బందికి విద్యుత్ అధికారులకు మా స్కూలు, శానిటైజర్ పంపిణీ చేశారు. శ్రీ రాఘ వేంద్రహాస్పిటల్ సహకారంతో బోయిన్పల్లి క్రీడా మైదానం వద్ద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన కంటోన్మెంట్ కార్మికులు, విద్యుత్ విభాగం ప్రతిధులు శానిటేషన్ ఎన్95 మాస్క్లు, డ్రింక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, సీనియర్ నాయకుడు రాయల్ కుమార్, శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్, రేణుక మహేందర్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. జంపన ప్రతాప్ మాట్లాడుతూ సేవా హి సంఘటన్ కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.