Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
నిరుపేదలకు అండగా బీఎల్ఆర్ ట్రస్ట్ నిలుస్తోందని టీఆర్ఎస్ నేత నేమూరి మహేష్‌గౌడ్ అన్నారు. చర్లపల్లి డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికుడు అరుణ్ బాబు(30) గుండెపోటుతో శనివారం మరణించడంతో వారి కుటుంబాన్ని ట్రస్ట్ తరపున నేమూరి మహేష్‌గౌడ్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న చైర్మెన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నయీం ఉన్నారు