Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్
- మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల ప్రారంభం
నవతెలంగాణ-ధూల్‌పేట్
రానున్న వర్షాకాలంలో వరదనీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ అన్నారు. బుధవారం జోనల్ పరిధిలోని చాంద్రాయణ గుట్ట, మలక్‌పేట్, ఫలక్‌నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మాన్సూన్ ఎమర్జెన్సీ బందాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి డివిజన్‌కు నలుగురు సిబ్బందితో ఒక్కో వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తే సమస్యలపై ప్రత్యేక బందాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడతాయన్నారు. ఇప్పటికే జోనల్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో 90 శాతం నాలాలు, డ్రెయినేజీ మ్యాన్‌హోల్ పూడిక తీత పనులు పూర్తి చేశామన్నారు. మూడు షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు జి. రజినీకాంత్ రెడ్డి, డి. జగన్, ఈఈలు కిష్టప్ప, లక్ష్మ నాయక్, నరేందర్ గౌడ్, డీఈఈలు సందీప్ కుమార్, భాను ప్రతాప్, ఏఈలు చిట్టి బాబు, డేవిడ్ భాస్కర్, అబ్దుల్ హాక్ తదితరులు పాల్గొన్నారు.