Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
చర్లపల్లి డివిజన్ ప్రజల సౌకర్యార్థం నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మొట్ట మొదటి సారిగా రెండు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ శానిటైజేషన్ వాహనా లను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరే టర్ మాట్లాడుతూ బొంతు ఫౌండేషన్ ద్వారా మొదటి సారిగా కాలుష్య రహిత శానిటైజేషన్ వాహనాలను చర్లపల్లి డివిజన్లో ప్రారంభించడం గర్వంగా ఉందనీ, కరోనా కష్టకాలంలో స్వచ్ఛ త, పరిశుభ్రత కోసం వీటిని వినియోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శివకుమార్ గౌడ్, విద్యాసాగర్, కనక రాజ్, బత్తుల శ్రీకాంత్ యాదవ్, కనకయ్య, కరీం, అలీ, వెంకన్న, లక్ష్మి నారాయణ, రమేష్, టీఆర్ఎస్వీ నాయకులు జయకృష్ణ, సంపత్, బాబు గంగపుత్ర, చాప భాస్కర్, చీర వినోద్ పాల్గొన్నారు..