Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రజలు కొట్లాడి సాధించుకున్న, కలలుగన్న బంగారు తెలంగాణ నేడు అప్పుల తెలంగాణగా మారిందని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. 7వ రాష్ట్ర అవతరణ దినో త్సవం సందర్భంగా విద్యానగర్లోని బీసీ భవన్లో బుధ వారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భ ంగా తెలంగాణ అమరవీరులకు నివాళ్లు అర్పించి అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన పర్యంతం త్యాగం చేసి సాధించిన రాష్ట్రం ఇందుకేనా అని ప్రశ్ని ంచారు. వేలాది మంది బీసీలు ఆత్మార్పణ చేసి రాష్ట్రం సాధించిన ప్రతిఫలంగా బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన పాలన ఇదనీ, బీసీ ఫెడరే షన్లను నిండా ముంచిన రాజ్యం అనీ, బీసీ ఆర్థిక సంస్థ లను నిర్వీర్యం చేసి రుణ సదుపాయాలు లేకుండా చేసిన పాలన అనీ, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా ఉద్యోగ కల్పన చేయక, నిరుద్యోగం పతాక స్థాయికి చేర్చిన ఘనత సాధించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ''వేలమ్ గాణ'' గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, పగిడాల సుధాకర్, బీసీ విద్యార్ధి సంఘం సిటీ ప్రెసిడెంట్ సుచిత్ కుమార్, నికిల్, లింగంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.