Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్
నవతెలంగాణ-అడిక్‌మెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్దన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవి ర్భావాన్ని పురస్కరించుకుని విద్యానగర్‌లోని చండ్రపు ల్లారెడ్డి భవన్లో టీఆర్ఎస్ పాలనపై నిరసన బుధారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లా డుతూ ఉద్యోగాల్లేకుండా నిరుద్యోగులు, పంటలకు కనీస ధరలు లేకుండా రైతులు, తక్కువ వేతనాలతో అసంఖ్యాక కార్మికులు చెప్పలేని కష్టాల్లో ఉంటే అధికారంలోని పెద్దలు రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. 1200 మంది బిడ్డల ఆత్మ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు కొందరికి బోగాల్నిస్తుందనారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు 16 ప్రజాసంఘాలను నిషేధించడం ఎంత మాత్రం తగదన్నారు. కరోనా బాధితులకు వైద్యం, వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఓడ బ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను అమలు చేయకుండా కాలం వెళ్లదీయడాన్ని తప్పు పట్టారు. మహిళలు, ఆదివాసులు, దళితులు, మైనా రిటీలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ, పీఓడబ్ల్యూ నగర అధ్యక్షురాలు సరళ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరుశురాం, బండారు విజయ, భారతి, కేవీ, మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.